2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకశాఖ 2025, సెప్టెంబరు 27న వెల్లడించింది. దేశంలోని అన్ని పురాతన కట్టడాల కంటే తాజ్‌మహల్ టికెట్లే అధికంగా అమ్ముడు పోయాయని, 62.6 లక్షల మంది స్వదేశీయులు, 6.45 లక్షల మంది విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శించారని తెలిపింది.