కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)కు సీఎస్‌ఆర్-338 స్నైపర్ రైఫిల్స్‌ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) గ్రూపు సంస్థ ఐకామ్ సరఫరా చేయనుంది. 200 రైఫిల్స్‌ను 2025 చివరి కల్లా అందించేందుకు సీఆర్‌పీఎఫ్, ఐకామ్, కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యంలో భాగంగా ఎడ్జ్ గ్రూపు సంస్థ కారకాల్‌తో కలిసి ఐకామ్ హైదరాబాద్‌లో ఆయుధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.