ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్ కింద మొత్తం 649 మార్గాలు నిర్వహణలోకి వచ్చాయని ప్రభుత్వం 2025, అక్టోబరు 21న వెల్లడించింది. ఇందులో 15 హెలీపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు 3.23 లక్షల ఉడాన్ విమానాల్లో 1.56 కోట్ల మందికి పైగా ప్రయాణించారని కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. 2027 ఏప్రిల్ తర్వాతా ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2016 అక్టోబరు 21న ఉడాన్ పథకాన్ని ప్రారంంభించారు. మొదటి విమానాన్ని 2017 ఏప్రిల్ 27న శిమ్లా-దిల్లీ మార్గంలో నడిపారు.