పరీక్షల సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్‌

పరీక్షల సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్‌
  • జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 26న ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని నేతృత్వం వహిస్తారని చెప్పారు.

  • పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్ఠంగా వినియోగించుకోవడం, విస్తృత.. పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను టాస్క్‌ఫోర్స్‌ ఇస్తుందని తెలిపారు. ఆధార్‌ ప్రాజెక్టు కోసం యూపీయే ప్రభుత్వ హయాంలో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్‌) ఛైర్మన్‌గా నీలేకని పని చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram