దేశంలో 3 భారీ రసాయన పార్కులను రూ.3,030 కోట్లతో ఏర్పాటు చేసేందుకు, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ (భవ్య- రసాయన్) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3,000 కోట్లను ఆయా పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాలు - ప్రాథమిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తారు.
మిగతా రూ.30 కోట్లను పాలనాపరమైన వ్యయాల కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి 2030-31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. రసాయనాల తయారీలో మనదేశం స్వయంసమృద్ధి సాధించడమే ఈ పథక లక్ష్యం.
వ్యవసాయం, ఔషధ రంగాలు, జౌళి, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, వాహన వంటి పలు రంగాలకు అవసరమైన ప్రాథమిక ముడి సరకులను అందించేందుకు ఈ పార్క్‌లు ఉపయోగపడతాయి.