సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా అయిదుగురిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థాన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జూన్ 1న ఆమోద ముద్ర వేశారు. వీరితో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరుతుంది. పంజాబ్ హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్‌నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీచంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జమ్మూకశ్మీర్-లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌పళ్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు 2026, మే 27న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.