భారత నూతన త్రిదళాధిపతిగా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి 2026, మే 31న బాధ్యతలు చేపట్టారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. పాకిస్థాన్, చైనా వ్యవహారాల నిపుణుడిగా పేరున్న ఆయనకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ల ఏర్పాటుద్వారా మిలిటరీ థియేటరైజేషన్ ప్రణాళికను అమలు చేయడం ప్రధాన బాధ్యతగా ఉంది. గతంలో ఆయన జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌లో సైనిక సలహాదారుగా సేవలందించారు. 2025, జులై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ హోదాలో రిటైరయ్యారు.