దేశీయ హైడ్రోజన్‌ రైలు

దేశీయ హైడ్రోజన్‌ రైలు
  • హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ సాయంతో పనిచేసే ఈ రైలును పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా హరియాణాలో అతి త్వరలో ప్రారంభించనున్నారు.
  • ఈ ప్రాజెక్టు కోసం అక్కడి జీంద్‌ నగరంలో ఇప్పటికే హైడ్రోజన్‌ నిల్వ-రీఫ్యూయెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికాల్లో మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్‌ రైళ్లు నడుస్తుండటమో.. వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండటమో జరుగుతోంది. హరియాణాలో రైలు పట్టాలెక్కితే ఈ దేశాల సరసన భారత్‌ చేరుతుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram