సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆఫ్ ఆల్ ఇన్ సొసైటీ పథకం కింద సిక్కిం ఈ ఫలితం సాధించిందని ఆయన పేర్కొన్నారు.