పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమా సుగమ్ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.
2025, సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ దీన్ని ప్రారంభించారు.
భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నేతృత్వంలో బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్‌ఐ) దీన్ని ఆవిష్కరించింది.
2047 నాటికి దేశంలో అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యమని అజయ్ సేథ్ తెలిపారు.