దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2025, సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీనికోసం రాష్ట్రమంతటా 13,944 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు.