రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, సెప్టెంబరు 24న దిల్లీలో 20 మంది కళాకారులకు లలిత కళా అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో అభిషేక్ శర్మ, స్కర్మ సోనం తాషీ, విజయ్ ఎం ధోరే, భాస్కర్ జ్యోతి గగొయ్, ఆశిష్ ఘోష్, గిరిరాజ్ శర్మ, ఆనంద్ జైశ్వాల్, కేసీఎస్ ప్రసన్న, కాను ప్రియ, తపతి భౌమిక్ మజుందార్, వీజీ వేణుగోపాల్ తదితరులున్నారు. వారికి రూ.2 లక్షల ప్రైజ్‌మనీ, మెమెంటో, ప్రశంసా పత్రం ఇచ్చారు.