తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డులను 2025, సెప్టెంబరు 24న ప్రకటించింది. కళారంగంలో పలు విభాగాల్లో కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ఈ అవార్డులను అందిస్తారు. ఇందులో భాగంగానే తాజాగా 2021-23 సంవత్సరాలకు గానూ ఏడాదికి 30 మంది చొప్పున 90 మంది కళాకారులు కలైమామణి అవార్డులకు ఎంపికైనట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
వీటితో పాటు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరిట జాతీయ పురస్కారానికి ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్‌ను ఎంపిక చేసింది.