ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (ఆఫీసర్ ర్యాంకు-ఓడీ) అవార్డు దక్కింది. అక్టోబరు 20న జమైకా నేషనల్ హీరోస్ డే సందర్భంగా ఈ అవార్డును జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ప్రదానం చేశారు. అతి తక్కువ ఫీజులకే అక్కడ వైద్యం చేస్తుండటంతో నాగమల్లేశ్వరరావు ‘ఫైవ్ బిల్స్ డాక్టర్’గా పేరుపొందారు.