వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోను (58) 2025 ఏడాదికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా కమిటీ ప్రశంసించింది.వెనెజువెలాలో అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది.
నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న 20వ మహిళ మచాదో. ఆమె 1967 అక్టోబరు 7న జన్మించారు.