‘ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌ 2026’

‘ఫుడ్‌ ప్లానెట్‌ ప్రైజ్‌ 2026’
  • ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్‌ఎఫ్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్‌ ప్రైజ్‌ 2026’ దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్‌ బెర్గ్‌ఫోర్స్‌ ఫౌండేషన్‌ అందిస్తోంది. స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ అవార్డు అందుకున్నారు. 
  • ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎన్‌ఎఫ్‌ ఎంపికైంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram