హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్కయి (71)కి 2025, అక్టోబరు 9న నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది. లాస్లో రచించిన శాటన్ టాంగో, ది మెలాన్కలీ ఆఫ్ రెసిస్టెన్స్ లాంటి నవలలను హంగరీ దర్శకుడు బెలా టార్ సినిమాగా తీశారు. 2015లో ఆయన్ను మాన్ బుకర్ బహుమతి వరించింది. 2019లో అమెరికాలో అనువాద సాహిత్యానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.