పైలట్ల కోసం శిక్షణ కేంద్రాన్ని ఎయిరిండియా, ఎయిర్‌బస్ సంయుక్తంగా హరియాణాలో నెలకొల్పాయి. ఎయిరిండియా ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు 2025, సెప్టెంబరు 30న ప్రారంభించారు.
ఎయిర్‌బస్ ఏ320, ఏ350 విమానాల పైలెట్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. సిమ్యులేటర్ల కోసం ఈ సంస్థలు దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.