విశాఖ భీమిలికి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు ఇటీవల యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు పొందాయి.
అత్యంత అరుదైన ఇలాంటి ప్రదేశాలు దక్షిణాసియాలో మూడే ఉన్నాయి.
తమిళనాడు, శ్రీలంకలో ఉన్నా భౌగోళికంగా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.
జనావాసాలకు సమీపంలో ఉన్నవి, పేరెన్నికగన్నవి మాత్రం భీమిలి ఎర్రమట్టి దిబ్బలే.
అందుకే వీటిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2014లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.