అఫ్గానిస్థాన్‌లో 2025 సెప్టెంబరు 1న తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం నమోదైంది.
ఏకంగా 800 మందికి పైగా మరణించగా.. 2,500 మందికి పైగా పౌరులు క్షతగాత్రులయ్యారు.
భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి.
జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉంది.
0-70 కిలోమీటర్ల లోతులో వచ్చే భూకంపాల్లో తీవ్రత అత్యధికంగా ఉంటుంది.
వీటిలో ప్రకంపనలు ఎక్కువ దూరం ప్రయాణించవు.
దీంతో అవి తమ శక్తినంతా తక్కువ విస్తీర్ణంలోనే చూపుతాయి.