హిమాలయాల్లో 56 ప్రమాదకర సరస్సులు

హిమాలయాల్లో 56 ప్రమాదకర సరస్సులు

భారత భూభాగంలోని హిమాలయ పర్వతాల్లోంచి ఉద్భవిస్తున్న నదుల పరీవాహక ప్రాంతాల్లో 10 హెక్టార్ల కన్నా ఎక్కువ వైశాల్యం కలిగిన 2,485 హిమానీనద సరస్సులను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2026, జులై 23న వెల్లడించింది. తన భూభాగంలో ఉన్న 56 హిమానీనద సరస్సులు ప్రమాదకరమైన వరదలకు దారితీసే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి లోక్‌సభలో తెలిపారు. నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న హిమానీనద సరస్సులను కేంద్ర జల మండలి (సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram