దిల్లీ జింఖానా క్లబ్‌

దిల్లీ జింఖానా క్లబ్‌
  • దేశ రాజధానిలో ఆటవిడుపు కేంద్రంగా శతాబ్దానికిపైగా కొనసాగుతున్న జింఖానా క్లబ్‌ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. లుట్యెన్స్‌ దిల్లీలోని నంబర్‌ 2, సఫ్దర్‌జంగ్‌ రోడ్డులోని ఈ క్లబ్‌ను బ్రిటిష్‌ పాలనలో నిర్మించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసానికి దగ్గర్లో ఇంది ఉంది.
  • ఈ క్లబ్‌... 1913లోనే ఏర్పాటైనా దాని భవన నిర్మాణం 1930 ప్రాంతంలో జరిగింది. దిల్లీలోని కనాట్‌ ప్లేస్, తీన్‌మూర్తీ భవన్‌ వంటి అద్భుత నిర్మాణాల రూపశిల్పి రాబర్ట్‌ టి రస్సెల్‌ ఈ క్లబ్బు భవనాన్ని నిర్మించారు. స్వాతంత్య్రం అనంతరం ‘ఇంపీరియల్‌’ అనే పదాన్ని క్లబ్‌ పేరు నుంచి తొలగించినప్పటికీ ఇక్కడి నిబంధనలు, సంస్కృతి ఆంగ్లేయుల మాదిరిగానే ఉంటాయనే విమర్శలున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram