రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్మును ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. అక్టోబరు 8న పదవీకాలం ముగియనున్న ఎం.రాజేశ్వర రావు స్థానాన్ని ముర్ము భర్తీ చేస్తారు. అక్టోబరు 9 నుంచి మూడేళ్ల పాటు ముర్ము నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్‌ను ఆయన పర్యవేక్షిస్తున్నారు.