భారత అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. దీంతో సెప్టెంబరు 30న ముగియాల్సిన ఆయన పదవీకాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆయన 2022లో కె.కె.వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. 1950 ఏప్రిల్ 13న పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు.
1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేటుగా గుర్తింపునిచ్చింది.