అమెరికాకు చెందిన టెలికాం నెట్‌వర్క్ సంస్థ టి-మొబైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా భారతీయ మూలాలున్న అమెరికన్ శ్రీని గోపాలన్ నియమితులయ్యారు. 2025 నవంబరు 1 నుంచి గోపాలన్ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా గోపాలన్ ఉన్నారు.
2020 నుంచీ సీఈఓగా ఉన్న మైక్ సీవర్ట్ స్థానంలో శ్రీని పగ్గాలు చేపడతారు.