టీమ్‌ఇండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎవరూ సాధించని ఘనతతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు (931) పొందిన టీ20 బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2000లో ఇంగ్లాండ్ బ్యాటర్ మలన్ (919) సాధించిన రికార్డును అతడు అధిగమించాడు.
గతంలో 900 రేటింగ్ పాయింట్లు సాధించిన భారత మూడో బ్యాటర్‌గా నిలిచిన 25 ఏళ్ల అభిషేక్ కొద్ది రోజుల్లోనే ప్రపంచ రికార్డును తిరగరాశాడు.