ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ప్రెసిడెంట్‌గా ఉమారెడ్డి 2025, సెప్టెంబరు 27న బాధ్యతలు స్వీకరించారు. సంస్థ ఏర్పాటైన 108 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్ ఈమె. 1916లో ఎఫ్‌కేసీసీఐను సర్ ఎం.విశ్వేశ్వరయ్య స్థాపించారు. దీనికి తొలి నుంచి పురుషులే ప్రెసిడెంట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఎఫ్‌కేసీసీఐలో 5,000 మంది ప్రత్యక్ష సభ్యులు, సుమారు 200 వాణిజ్య, పరిశ్రమ అసోసియేషన్లు, 2 లక్షల మంది పరోక్ష సభ్యులు ఉన్నారు. దేశ జీడీపీలో కర్ణాటక వాటా 8-9 శాతంగా ఉంటుంది.