త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలాన్ని 8 నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 30తో ఆయన పదవీకాలం ముగియాల్సి ఉంది. 2026, మే 30 వరకు, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఆయన సీడీఎస్‌గా ఉంటారు.
2022 సెప్టెంబరు 30 నుంచి ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు.