దిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ (45 ఏళ్లు) ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడు.
నామినేషన్లకు 2025, సెప్టెంబరు 21న ఆఖరి రోజు కావడంతో మన్హాస్ ఒక్కడే నామినేషన్ వేశాడు.
రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. మన్హాస్ అధ్యక్షుడు కానున్న విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించాడు.
మన్హాస్ దిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.