బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి అరుణిమా కుమార్ కింగ్ ఛార్లెస్-3 గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పతకా(బీఈఎం)న్ని అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి కూచిపూడి నృత్యకళాకారిణిగా ఆమె నిలిచారు. భారతీయ శాస్త్రీయ నృత్యం, సమాజానికి చేసిన సేవకుగానూ అరుణిమాకు ఈ పతకం దక్కింది.