మేజర్‌ నవ్య షెకావత్‌ 

మేజర్‌ నవ్య షెకావత్‌ 

మేజర్‌ నవ్య షెకావత్‌ భారత రాష్ట్రపతి వద్ద ‘ఎయిడ్‌-డి-క్యాంప్‌’ (ఏడీసీ)గా ఎంపికై, ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్‌గా ఘనత సాధించారు. సైన్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బాధ్యతల్లో ఇదీ ఒకటి. రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక, దౌత్య, జాతీయ వేడుకలలో ప్రొటోకాల్‌ నిర్వహణ, పర్యవేక్షణ వంటివి చూస్తారు. సాధారణంగా రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి ఒకరు చొప్పున మొత్తం ఐదుగురు ఏడీసీలు ఉంటారు. దశాబ్దాలుగా పురుషులకే పరిమితమైన ఈ స్థానంలో ఆర్మీ నుంచి ఎంపికైన తొలి మహిళా అధికారి మేజర్‌ నవ్య షెకావత్‌. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram