టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మేటి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు.
2025, సెప్టెంబరు 17న ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగైన వరుణ్ 733 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
జాకబ్ డఫీ (717- న్యూజిలాండ్) రెండు, అకీల్ హొస్సేన్ (707- వెస్టిండీస్) మూడో స్థానాలు సాధించారు.
రవి బిష్ణోయ్ 8వ, అక్షర్ పటేల్ 12వ, అర్ష్‌దీప్‌సింగ్ 14వ, కుల్దీప్ యాదవ్ 23వ స్థానాల్లో ఉన్నారు.
టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న భారత మూడో బౌలర్ వరుణ్. జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ ముందే ఈ ఘనత సాధించారు.