ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్‌కు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు వరుసగా మూడోసారి ఎన్నికైంది. నవంబరు 2022- నవంబరు 2029 కాలానికి గాను కొత్త సభ్యుల వివరాలను 2025, అక్టోబరు 10న బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.
సింధు, ఆన్ సి యంగ్ (కొరియా), దోహా హనీ (ఈజిప్ట్), జియా యి ఫాన్ (చైనా), డెబోరా జిలీ (నెదర్లాండ్స్) కమిషన్‌లో చోటు సంపాదించారు. అయిదు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.