పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌లో బిలియన్ డాలర్ల సంపాదన (1.4 బిలియన్లు) ఉన్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం రొనాల్డో సంపాదన రూ.12,440 కోట్లు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్‌తో తాజాగా రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకోవడంతో అతడీ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఒప్పందం ద్వారానే రొనాల్డో ఏడాదికి రూ.2 వేల కోట్లకుపైగా సంపాదిస్తున్నాడు. ప్రకటనల ద్వారా మరో రూ.1500 కోట్లు ఆర్జిస్తున్నాడు.