భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ (38) నియామకానికి సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఈయనకు డొనాల్డ్ ట్రంప్ విధేయుడిగా పేరుంది. ఓటింగులో 51 మంది సెనెటర్లు గోర్‌కు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత రాయబారిగానే కాకుండా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగానూ గోర్ వ్యవహరించనున్నారు.