‘వికసిత్ భారత్ బిల్డథాన్ 2025’కు బ్రాండ్ అంబాసిడర్‌గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తారని విద్యాశాఖ 2025, అక్టోబరు 5న వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనేలా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 1.50 లక్షల పాఠశాలల నుంచి కోటి మందికి పైగా విద్యార్థులను నాలుగు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఆలోచన, రూపకల్పన, నమూనాలను అభివృద్ధి చేసేలా బిల్డథాన్ సమీకరిస్తుంది.