సూర్యకిరణాల నుంచి నేరుగా జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్) తయారుచేసే పరికరాన్ని భారత్‌కు చెందిన ప్రొఫెసర్ వందనా నాయక్ కనిపెట్టారు. దీనికి పేటెంట్ హక్కులు కూడా పొందారు. ఆమె మధ్యప్రదేశ్‌లోని సాగర్ సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.
‘డయా ఫ్యూయెల్’ అని పిలిచే ఈ జీవ ఇంధనం డయాటమ్ అనే సూక్ష్మజీవి (ఆల్గే) నుంచి తయారవుతుంది.