ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధవిమానం మిగ్-21కు 2025, సెప్టెంబరు 26న వైమానిక దళం నుంచి వీడ్కోలు పలికారు. చండీగఢ్‌లో జరిగిన వేడుకలో ఈ ఫైటర్ జెట్‌లను లాంఛనంగా వాయుసేన నుంచి ఉపసంహరించారు. వాటి స్థానాన్ని దేశీయ తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేస్తోంది.
రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్-21 భారత తొలి సూపర్‌సోనిక్ యుద్ధవిమానం.