భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) ఉపగ్రహం చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి. 2025, జులై 30న శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలోని ఎస్-బ్యాండ్ రాడార్‌ను ఇస్రో, ఎల్-బ్యాండ్ రాడార్‌ను నాసా రూపొందించాయి. ఎల్-బ్యాండ్ రాడార్.. ఆగస్టులో రెండుసార్లు అమెరికాలోని పలు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఆగస్టు 21న మెయిన్ రాష్ట్రంలోని మౌంట్ డెజర్ట్ ద్వీపాన్ని చిత్రీకరించింది. అడవులు, జలమార్గాలు, పట్టణ నిర్మాణాలు, భవనాలు, వృక్ష సంపద, నీటి వనరులను ఇందులో కళ్లకు కట్టింది.