రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా ‘అగ్ని ప్రైమ్’ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2025, సెప్టెంబరు 25న తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్వే వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా క్షిపణిని సులభంగా తరలించే వీలుంది. అతి తక్కువ వెలుతురులోనూ, అతి స్వల్ప సమయంలోనూ ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.