నౌకాదళ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (ఎఫ్‌ఏసీ) సిమ్యులేటర్‌ను విడుదల చేసినట్లు జెన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అప్లైడ్ రిసెర్చ్ ఇంటర్నేషనల్ తెలిపింది. ఓడల నిర్వహణ, నావిగేషన్, పోరాట వ్యూహాలు, రిమోట్ ఆయుధ అనుసంధానం లాంటివన్నీ ఈ సిమ్యులేటర్ అందిస్తుంది.