అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక తాజాగా సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి.. గంటకు 6,87,000 కి.మీ. వేగంతో పయనించింది.
ఇంత వేగంతో ప్రయాణిస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి 19 సెకన్లు మాత్రమే పడుతుంది.
పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పటికే మూడుసార్లు ఈ వేగాన్ని సాధించింది. సూర్యుడికి చేరువయ్యే క్రమంలో ఎదురైన తీవ్రస్థాయి గురుత్వాకర్షణ బలం వల్ల ఇది సాధ్యమైంది.
2018లో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. కక్ష్యలో పరిభ్రమిస్తూ పలుమార్లు భానుడి సమీపంలోకి వెళుతోంది.
తద్వారా వ్యోమగాములు, ఉపగ్రహాలు, విద్యుత్ గ్రిడ్‌కు హానికలిగించే సౌర గాలులు, జ్వాలలు, తుపాన్లపై కీలక వివరాలను సేకరిస్తోంది.