సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి తాజాగా చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ) సముద్రం నుంచి డేటాను సేకరించడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘బోట్-బేస్డ్ రియల్-టైమ్ టోవ్డ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్’ అనే కొత్త టెక్నాలజీని సిద్ధం చేసింది. దీని ద్వారా ఫిషింగ్ బోటును ఉపయోగించి సముద్రగర్భంలోని సమాచారాన్ని సేకరించవచ్చు.