అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ రూపొందించిన భారీ రాకెట్ స్టార్‌షిప్ 13వసారి నింగిలోకి పయనమైంది. ఈ మిషన్‌లో అది ప్రపంచాన్ని సగం మేర చుట్టేసింది. 20 అధునాతన స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
124 మీటర్ల పొడవైన ఈ రాకెట్ టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌కు చెందిన రోదసి ప్రయోగ కేంద్రం నుంచి బయల్దేరింది. రెండు నిమిషాల తర్వాత బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడిపోయింది. ఆ తర్వాత స్టార్‌షిప్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నింగిలో 200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొంది.