గ్రహశకలానికి తెలుగు శాస్త్రవేత్త పేరు

గ్రహశకలానికి తెలుగు శాస్త్రవేత్త పేరు

అంతరిక్షంలోని ‘1999 ఎక్స్‌ఏ169’ అనే గ్రహశకలానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ భీరవరసు శ్రీరామ్‌ శరణ్‌ పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఖరారు చేసింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు చెందిన ఈయన అహ్మదాబాద్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో ప్లానెటరీ రాడార్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలపై ఆయన సాగించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram