ఎయిర్ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ 2026, జులై 22న కర్ణాటకలోని కార్వార నావల్ బేస్‌లో ఐఎన్‌ఎస్ మహేశ్రేణికి చెందిన రెండో యుద్ధనౌక అయిన ‘ఐఎన్‌ఎస్ మాలవన్’ను ప్రారంభించారు. యాంటీ సబ్ మెరైన్, మారిటైం ఆపరేషన్స్ దీని ప్రత్యేకత. 80 శాతం స్వీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దీన్ని తయారు చేశారు.
మహేశ్రేణి నౌకలను తీర ప్రాంత జలాల్లో భద్రతా కార్యక్రమాల కోసం ఉద్దేశించారు. వీటిని యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, మైన్ వార్‌ఫేర్, లో ఇన్‌టెన్సిటీ మారీటైం ఆపరేషన్స్ కోసం రూపొందించారు.