ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్‌ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో ఈ శ్రేణికి చెందిన 8-10 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని పేర్కొంది. ‘దృష్టి’ అనే ఈ ఉపగ్రహం 160 కిలోల బరువును కలిగి ఉంటుంది.
భారత్‌లోని ప్రైవేటు పరిశ్రమ నిర్మించిన శాటిలైట్లలో ఇదే అతిపెద్దది కావడంతోపాటు అత్యంత ఎక్కువ రిజల్యూషన్ కలిగి ఉందని గెలాక్స్‌ఐ పేర్కొంది.
ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందిస్తుంది.