భారత దేశంలో తొలిసారిగా బాల పరిరక్షణ నవీకరణ నిధి (సీపీఐఎఫ్)ని యునిసెఫ్ ఏర్పాటు చేసింది. ఈ నిధి బాలలకు భద్రత కల్పించే సిబ్బందిని ఏర్పాటు చేయడానికి, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు చేరవేసేందుకు,
కౌమార దశలో ఉన్న బాలికలకు సాయం అందించడానికి, పిల్లలకు ఆన్‌లైన్ భద్రత కల్పించడం మొదలైన లక్ష్యాల సాధన కోసం ఏర్పాటైంది.
పిల్లల పరిరక్షణే ధ్యేయంగా రూపొందిన స్పాన్సర్ స్మార్ట్ అనే ఆన్‌లైన్ సాంకేతిక పరిజ్ఞానం ఈ నిధికి అండగా నిలవనుంది. ఇది వాట్సప్ ఆధారంగా పనిచేసే వేదిక.