ఫతాహ్-4 అనే క్రూజ్ క్షిపణిని పాకిస్థాన్ 2025, సెప్టెంబరు 30న విజయవంతంగా పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని సైన్యం తెలిపింది. ఇందులో అధునాతన ఏవియానిక్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది.
నేలకు అత్యంత సమీపం నుంచి దూసుకెళుతుందని, అందువల్ల శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇది తప్పించుకోగలదని పేర్కొంది.