లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయె తకాయిచి (64) జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు. ఆమె గడచిన ఐదేళ్లలో జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాలుగో వ్యక్తి.